SKLM: ఈఏపీ సెట్-2024 ప్రవేశాలకు సంబంధించి బైపీసీ స్ట్రీమ్ ప్రవేశాల చివరి విడత కౌన్సెలింగ్ గురువారం నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బి.జానకి రామయ్య ప్రకటనలో తెలిపారు. బైపీసీ స్ట్రీమ్ బీటెక్, బీఈ బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, డీ ఫార్మాలో ప్రవేశాలు లభిస్తాయన్నారు. ఈ నెల 21లోపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నారు.