W.G: ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తణుకు మండలం దువ్వకు చెందిన టి.అప్పలస్వామి ఎన్నికయ్యారు. విజయవాడలో గురువారం జరిగిన రాష్ట్రస్థాయి వర్క్ షాప్ పురస్కరించుకొని నూతన కమిటీలో భాగంగా తనను ఎన్నుకున్నారని చెప్పారు. జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారానికై బలమైన ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని అప్పలస్వామి పేర్కొన్నారు.