E.G: రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామానికి చెందిన పలువురు గురువారం జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తున్న తీరు, నియోజకవర్గ అభివృద్ధికి MLA చేస్తున్న కృషి పట్ల ఆకర్షితులై పార్టీలకు చేరినట్లు తెలిపారు.