SKLM: ప్రాథమిక స్థాయి నుంచే జాతీయ నాయకుల గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని రిసోర్స్ పర్సన్ లంకలపల్లి సూర్యనారాయణ అన్నారు. సోమవారం లావేరు గ్రంథాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి జాతీయ నాయకుల జీవిత చరిత్ర క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. అలాగే ప్రతిరోజు నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు.