ఒంగోలులోని ఆంజయ్య రోడ్లో గల ఒయాసిస్ ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సంతానోత్పత్తి కేంద్రంలో ఆదివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ యామిని చంద్రిక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగే ఈ శిబిరంలో మహిళలకు సంతాన సమస్యలపై వైద్యపరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్యం అందిస్తామని పేర్కొన్నారు.