NLR: ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఈనెల 28న కోవూరులో భారీ ప్రదర్శన చేస్తామని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. పేద ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుంది అన్నారు. విద్యార్థులు, ప్రజల భవిష్యత్ తరాల కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటం ఉదృతం చేస్తామన్నారు. కూటమి పరిపాలనలో పేదలకు ఆనందం కరువు అయిందన్నారు.