SKLM: సెల్ఫోన్ వినియోగిస్తున్న మహిళలు సైబర్ నేరాలు పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ అమ్మాజీ తెలిపారు. శుక్రవారం ఆమదాలవలస మండలం వంజంగి గ్రామంలో వెలుగు మహిళా సభ్యులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. తెలియని యాప్ల ద్వారా మెసేజ్లు వచ్చినట్లయితే వాటిని ఎట్టి పరిస్థితులలో తెరవద్దని సూచించారు.