AKP: రోలుగుంట(మం) ఆర్ల పంచాయతీ గిరిజన గ్రామాల్లో విద్యుత్ బిల్లులు వివాదంగా మారాయి. కేవలం రెండు దీపాలు వినియోగిస్తున్నప్పటికీ రూ.25 వేల వరకు బిల్లులు రావడంతో పీటీజీ గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. బిల్లులను పునఃపరిశీలించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.