KRNL: కర్నూలులో అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి. విశ్వనాథ్ తెలిపారు. కేఎంసీ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు సౌకర్యవంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అందరికీ అందుబాటులో ఉండేందుకు ఈ అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.