SKLM: జలుమూరు శ్రీముఖలింగేశ్వర ఆలయం సమీపంలో ఈ నెల 9న జరగనున్న బాలియాత్ర మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ బాలియాత్ర జరుగనున్న ఆలయం పరిసరాల్లో నదీ తీరం, తీర్థ ఘాట్ ప్రాంతాలను పరిశీలించారు. సీసీ కెమెరాలు బారికేడ్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు.