GNTR: తుళ్లూరు మండలంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. శాఖమూరు గ్రామంలోని సమ్మక్క సారక్క ఆలయం వద్ద ఉన్న తానాపతి చెరువులో గురువారం గుర్తుతెలియని మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈమేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని చెరువులోని నీటిని తోడే ఏర్పాట్లు చేస్తున్నారు.