ATP: విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ పవన్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించారు. త్వరలో రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండటంతో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.