కృష్ణా: జిల్లాలో అవుట్ రీచ్ కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరిగి యూరియా లభ్యతపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం మచిలీపట్నంలో మాట్లాడుతూ.. యూరియా సరఫరా, పంపిణీపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. గ్రామాల్లో ఇంటింటికి యూరియా సరఫరా నిరంతరం జరుగుతుందని పేర్కొన్నారు.