NDL: బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో ఇవాళ విషాదం నెలకొంది. ఎస్సీ కాలనీకి చెందిన వెంకటయ్య కుమారుడు బత్తుల కేశవ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య గొడవ పడి పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెంది ఉరేసుకున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల GGHకి తరలించారు.