KRNL: ఆలూరు మార్కెట్ యార్డు అభివృద్ధిపై ఎమ్మెల్యే విరుపాక్షి బుధవారం చిప్పగిరిలో కీలక సూచనలు చేశారు. రైతులకు ఉపయోగపడేలా కూల్ స్టోరేజ్ నిర్మించాలని, పశుసంస్కరణ సంతలకు సౌకర్యాలు కల్పించాలని ఆయన అన్నారు. సీసీఐ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. యార్డు కార్యదర్శి సునీత ప్రభుత్వ ఉత్తర్వు కాపీని ఎమ్మెల్యేకు అందజేశారు.