ATP: తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి గ్రామంలో సునీత అనే మహిళ మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు సునీతను చికిత్స నిమిత్తం 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.