ATP: ఆర్డీటీకి సంబంధించి మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ఆ సంస్థకు FCRA రెన్యువల్ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారని చెప్పారు. త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 50ఏళ్లుగా జిల్లాలో ఆ సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని మంత్రి కొనియాడారు.