నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్లో ఇవాల ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్తంభం విరిగి పడడంతో ప్రాంతంలో భయాందోళన నెలకొంది. ఘటన సమయంలో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు వెంటనే స్పందించి విద్యుత్ శాఖ సబ్‌స్టేషన్‌కు సమాచారం అందించడంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేసారు.