SKLM: ఏపీ పీజీ సెట్-2024 రెండో విడత కౌన్సిలింగ్కు సంబంధించి సోమవారం నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్లో ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. 26న మార్పునకు అధికారులు అవకాశం కల్పించారు. కాగా శ్రీకాకుళం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో 562 సీట్లకు గాను ఈ కౌన్సిలింగ్కు 303 సీట్లు అందుబాటులో ఉన్నాయి.