ELR: కర్నూలులోని పుష్పరాజు ఫంక్షన్ హాల్లో ఈ నెల 22వ తేదిన జరిగిన సీనియర్ స్టేట్ కరాటే ఛాంపియన్ షిప్ 2024 పోటీల్లో ఓపెన్ టీమ్ కుమిటి విభాగంలో ఏలూరుకు చెందిన శిక్షకులు స్వర్ణ పతకాలు సాధించి ఏలూరును రెండో స్థానానికి తీసుకొని వచ్చారు. ఈ శిక్షకులు ఛాంపియన్ షిప్ కప్ మరియు 3 వేల రూపాయలు బహుమతిగా గెల్చుకున్నారని వీరి కోచ్ ఎం. ఇబ్రహీం బేగ్ తెలిపారు.