NLR: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయిమెంట్ కార్యాలయం, సీడాప్ సంయుక్తంగా ఈనెల 27న వెంకటేశ్వరపురం ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ కే శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు, ఐటీఐ, డిప్లమో చదివినవారు అర్హులన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.