ప్రకాశం: టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా మార్కాపురానికి చెందిన, ఆర్యవైశ్య కీలక నేత వక్కలగడ్డ మల్లికార్జున్ నియమితులయ్యారు. గతంలో టీడీపీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, ఆయన సతీమణి రాధిక మార్కాపురం మున్సిపల్ ఛైర్మన్గా పనిచేశారు. అధికారంలో ఉన్నప్పుడు మార్కాపురం పట్టణ అభివృద్ధి, పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.