KDP: వైసీపీలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా స్పష్టం చేశారు. కడప నగరంలోని దేవుని కడపలో వైసీపీ నాయకుడు సుదర్శన్ ఇంటిపై నిన్న రాత్రి జనసేన పార్టీ నాయకులు దాడి చేయడాన్ని వారు ఖండించారు. ఉదయం కడప మేయర్ సురేశ్ బాబుతో కలిసి మాజీ డిప్యూటీ సీఎం సుదర్శన్‌ను పరామర్శించారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులపై దాడులు అధికమయ్యాయన్నారు.