కృష్ణ: హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కానుమోలు శివారు రైస్ మిల్ దగ్గర శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. మృతుడి ఆధార్ కార్డు వివరాల ప్రకారం.. రాజ్ కుమార్ బొల్లారం మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం తెలిసినవారు హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.