PLD: మండల కేంద్రమైన రొంపిచర్ల గ్రామంలో చెరువు కట్ట సెంటర్లో ఉన్న యేసు మహిమ ప్రార్థన మందిరంలో చోరీ జరిగింది. మందిరంలో ఉన్న యాంప్లిఫయర్లను గుర్తు తెలియని దుండగులు గురువారం రాత్రి చోరీ చేసినట్లు పాస్టర్ వై పాల్ రాజ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.