ప్రకాశం: కనిగిరి డిగ్రీ కళాశాల ఆవరణలో రాష్ట్ర స్కిల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (DGT) కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.