WG: మహిళల పట్ల వేధింపులను ప్రతి ఒక్కరు ఖండించాలని నాలుగవ అదనపు జిల్లా జడ్జి సత్యవతి అన్నారు. బుధవారం తణుకు కోర్టు ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆడ, మగ అనే లింగ వివక్ష విడనాడాలన్నారు. ఇరువురిని సమానంగా చూడాలని కోరారు. పని ప్రదేశంలో మహిళలకు ఎదురవుతున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. న్యాయమూర్తులు సత్యకృష్ణ, సాయిరాం పాల్గొన్నారు.