KKD: పెద్దాపురం మరిడమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం పంచామృత అభిషేకాలు, కుంకుమ పూజలు స్వర్ణ పుష్పాలతో మహా అభిషేకం నిర్వహించారు. దేవాదాయ సహాయ కమిషనర్ విజయలక్ష్మి, ఆలయ ధర్మకర్త చింతపల్లి బ్రహ్మాజీ, ఆలయ అభివృద్ధి కమిటీ నేతలు, భక్తులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం కుంకుమ, వెండి, బంగారు పుష్పాలతో పూజలు నిర్వహించినట్లు అర్చక స్వాములు తెలిపారు.