WG: గడచిన 24 గంటల వ్యవధిలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 479.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు శనివారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా ఉండి మండలంలో 50.4మీ. మీ, కాళ్ళ 49.4మీ. మీ, ఆకివీడు 35.2మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు కాగా.. జిల్లాలో అత్యల్పంగా పోడూరు మండలంలో 7.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.