JN: దేవరుప్పుల మండలం నల్లకుంట తండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బానోత్ మహేందర్ జెండాను ఆవిష్కరించే ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ తోనే పల్లెలు పట్టణాలుగా మారబోతున్నాయని వారన్నారు. ఉపసర్పంచ్ భాస్కర్, గ్రామ పార్టీ అధ్యక్షులు భానోత్ శ్రీనివాస్ ఉన్నారు.