SRCL: వేములవాడ విలీన గ్రామమైన కొనాయిపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సాయిని నరసయ్య గుండెపోటుతో మరణించిన కుటుంబాన్ని సోమవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట మార్కెట్ కమిటీ ఛైర్మన్ రోండి రాజు, వైస్ చైర్మన్ కనికరపూ రాకేష్, కౌన్సిలర్ నీలమ్మ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.