NZB: మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితాలో భారీగా తప్పులు దొర్లాయి. 6వ వార్డులో నిర్మల్, బోర్గాం(పి) ఓటర్ల పేర్లు నమోదయ్యాయి. కూలిపోయిన ఇంట్లో 18 మంది ఓటర్లున్నట్లు చూపడం గమనార్హం. 3, 19 వార్డుల్లో ఓట్లు తారుమారయ్యాయి. దొంగ ఓట్లపై వివిధ పార్టీల నేతలు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి జాబితాను సరిచేయాలన్నారు.