మన్యం: జిల్లాలో విద్యుత్ శాఖ ఎస్ఈగా చలపతిరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లాల పునర్విభజన అనంతరం పార్వతీపురం మన్యం జిల్లాలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లాలో తొలి సూపరింటెండెంట్ ఇంజనీర్ ఈయనే కావడం విశేషం. ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.