కృష్ణా: విలేకర్ల పట్ల ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఉదయం 10:30 గంటలకు తిరువూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేయనున్నట్లు నియోజకవర్గ విలేకర్ల బృందం తెలిపింది. తాము వెలికి తీసి పేపర్లలో రాసిన వార్తలను జీర్ణించుకోలేక ఎమ్మెల్యే మీడియాను బూతులతో తిట్టటం సిగ్గుచేటన్నారు.