SRPT: కోదాడలో ఇవాళ ఉద్రిక్తత వాతవరణం చోటు చేసుకుంది. చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రిమాండ్లో ఉన్న రాజేష్(30) అనారోగ్యంతో మృతి చెందిన ఘటనపై స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజేష్ మృతి పోలీసుల చిత్రహింసల వలన జరిగిందంటూ.. అతని బంధువులు, ఎస్సీ కాలనీకి చెందిన వందలాది మంది ప్రజలు పట్టణ పోలీస్ స్టేషన్కు ర్యాలీగా వెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు.