SKLM: నరసన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి బుధవారం ఉదయం 8:30 గంటలకు జలుమూరు మండలం వెంకటాపురం గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే కార్యక్రమం నిర్వహిస్తారని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం 10:30 గంటలకు జలుమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు.