ప్రకాశం: దళితులకు రాజ్యాధికారాన్ని దూరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణను తెరపైకి తీసుకువచ్చాయని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు.ఒంగోలులో ఎస్సీ వర్గీ కరణను వ్యతిరేకిస్తూ ‘హలో మాల..చలో ఒంగోలు’ పేరుతో మహా బహిరంగ సభ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. వర్గీకరణపై వచ్చిన తీర్పును రాష్ట్రాలు అమలు చేయకుండా నిలువరంచే విధంగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.