KDP: ఈనెల 25వ తేదీన నిర్వహించే చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ గోడ పత్రాలను సోమవారం ఉదయం జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రతినిధులు ప్రారంభించారు. వేంపల్లి పట్టణంలోని జేవీవీ కార్యాలయంలో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ గోడ పత్రాలను జేవీవీ ప్రధాన కార్యదర్శి బాల బయన్న, జిల్లా గౌరవాధ్యక్షుడు గంగాధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు చక్రపాణి రెడ్డి ఆవిష్కరించారు.