కృష్ణా: గన్నవరం ప్రభుత్వ కళాశాల విద్యార్థినిలు పుట్టా కీర్తి, రతికను రాష్ట్ర త్రోబాల్ పోటీలలో విజేతలుగా నిలిచిన సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరావు మాట్లాడుతూ.. ఆడపిల్లలు క్రీడలలో రాణిస్తే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, అలాగే వారు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు.