ELR: శారీరక దివ్యాంగుడైన యాతం రాజశేఖర్‌కు సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఉచితంగా కృత్రిమ అవయవాన్ని(కాలు) జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి చేతుల మీదుగా అందజేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీపై స్పందిస్తూ యాతం రాజశేఖర్ విభిన్న ప్రతిభావంతునికి ఉచితంగా కృత్రిమ అవయవాన్ని సమకూర్చారు.