CTR: వడమాలపేట మండలం ఎస్వీపురంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టీడీపీ నాయకులు శేషాద్రి యాదవ్, వెంకయ్య, చెంగల్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్వీపురం అభివృద్ధి, పారిశుద్ధ్య చర్యలు, గ్రామ సమస్యల అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్, సెక్రటరీలు పాల్గొన్నారు.