W.G: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు ముందు ఉండాలని, అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం రూరల్ సీఐగా నియమితులైన బంటుమిల్లి శ్రీనివాసరావు మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యేను సోమవారం కలిశారు. ప్రజలకు పోలీసులకు స్నేహపూర్వక వాతావరణం తీసుకుని రావాలని ఈ సంధర్భంగా ఎమ్మెల్యే సూచించారు.