ELR: ఉంగుటూరు గ్రామాంలో శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం నందు ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి లడ్డు మహా ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు కలపి గత పాలకులు తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.