ప్రకాశం: చీరాల పట్టణంలోని 23వ వార్డు నందు సోమవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు కొండయ్య పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రజల్లో ఆదరణ పొందిందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ను ఒకేసారి 4000 పెంచి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకే దక్కిందని చెప్పారు.