SKLM: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానానికి త్వరలో కొత్త సిబ్బంది వచ్చి విధుల్లో చేరనున్నారు. సింహాచలం సూపరిండెంట్ ఎస్. కనకరాజు, సీనియర్ అసిస్టెంట్ శోభనాద్రి చార్యులు, విజయనగరం మాన్సాస్ ట్రస్ట్‌కు చెందిన సీనియర్ అసిస్టెంట్ ఎ. శ్రీనివాసరావు అదే హోదాల్లో అరసవెల్లికి రానున్నారని దేవాదాయ శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు.