అనంతపురం: పరిగి మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులను సీజ్ చేసినట్లు పరిగి ఎస్ఐ రంగడుయాదవ్ తెలిపారు. సోమవారం పోలీసు సిబ్బందితో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. హిందూపురం మడకశిర రహదారి పక్కన ఉన్న టీడీపీ కార్యాలయంపై ఉన్న గదిలో నిల్వ ఉంచిన బాణాసంచాలను పోలీసులు గుర్తించారు. సుమారు రూ. 5 లక్షల విలువ చేసే టపాసులు సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.