Karate Kalyani: రాముడి రూపంలో ప్రభాస్, శివుడి రూపంలో చిరంజీవి విగ్రహాం పెడతారా..?
రాముడి రూపంలో ప్రభాస్, వెంకటేశ్వరుని రూపంలో సుమన్, శివుని రూపంలో చిరంజీవి విగ్రహాన్ని పెడతారా అని కరాటే కళ్యాణి ప్రశ్నించారు. తనపై మా విధించిన సస్పెన్షన్ బాధ కలిగించిందని తెలిపారు.
Karate Kalyani: కరాటే కళ్యాణిని (Karate Kalyani) మా అసోసియేషన్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ విగ్రహాం (NTR Statue) కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయడంపై మొదలైన రగడ.. సస్పెన్షన్ వరకు వెళ్లింది. అసోసియేషన్ విధించిన సస్పెన్షన్ గురించి కరాటే కళ్యాణి (Karate Kalyani) స్పందించారు. తనను సస్పెండ్ చేయడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా విష్ణు (vishnu) ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటాడని అనుకొనని చెప్పారు. ఆయన వెనక ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ (ntr) అభిమానిని అని కరాటే కళ్యాణి (Kalyani) మరోసారి తెలిపారు. తప్పుగా కామెంట్స్ చేయలేదని తెలిపారు. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాం ఉండటమే వ్యతిరేకించానని తెలిపారు. ఆదిపురుష్ మూవీ చేశాడని రాముడి రూపంలో ప్రభాస్ (prabhas) విగ్రహాం.. అన్నమయ్య సినిమా చేసినందున వెంకటేశ్వరుని రూపంలో సుమన్ (suman) విగ్రహాం, శివుడి రూపంలో చిరంజీవి (chiranjeevi) విగ్రహాం పెడతారా అని అడిగారు.
ఈ నెల 28వ తేదీన ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాం (NTR Statue) ఆవిష్కరించాల్సి ఉంది. అదీ కృష్ణుడి రూపంలో ఉండటంతో కరాటే కళ్యాణి అభ్యంతరం వ్యక్తం చేశారు. యాదవ సంఘాలు కూడా అబ్జెక్ట్ చేశాయి. కోర్టును ఆశ్రయించడంతో విగ్రహాం ఆవిష్కరించొద్దని స్టే ఇచ్చింది. ఆ వెంటనే మా అసోసియేషన్ కరాటే కళ్యాణికి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులపై అసోసియేషన్ సంతృప్తి చెందలేదు. కరాటే కళ్యాణిని సస్పెండ్ చేసింది.