Mahesh Daughter Sitara: జ్యువెల్లరీ బ్రాండ్‌కు ప్రచారకర్తగా మహేశ్ కూతురు సితార
ప్రిన్స్ మహేశ్ బాబు కూతురు సితార ప్రముఖ జ్యువెల్లరీ షాపుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. దానికి సంబంధించి 3 రోజుల షూటింగ్ కూడా ఇటీవల పూర్తయ్యింది.
Mahesh Daughter Sitara: మహేశ్ బాబు (Mahesh babu) గారాలపట్టి సితార (Sitara) తండ్రికి తగ్గ కూతురిగా పేరు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్ స్టలో యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతీ ఇష్యూను షేర్ చేస్తుంటారు. ఫోటోలు, వీడియోలు.. డ్యాన్స్ షూట్లను పంచుకుంటారు. సితారకు (Sitara) ఇన్ స్టలో 12 లక్షలకు పైగా ఫాలొవర్స్ ఉన్నారు. తండ్రి మహేశ్‌తో (Mahesh) కలిసి పలు షో లలో కూడా పాల్గొంటారు.
సితారకు (Sitara) ఉన్న ఫాలొయింగ్ చూసి ఓ ప్రముఖ జ్యువెలరీ షాపు ప్రచారకర్తగా నియమించిందట. దీనిని మహేశ్ బాబు (Mahesh) ధృవీకరించారు. సితార కోసం ఆ సంస్థ భారీగానే రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. తమ బ్రాండ్ కోసం సితార (Sitara) మూడు రోజులు యాడ్ షూట్ చేశారని తెలిసింది. యాడ్ షూటింగ్ కోసం ప్రముఖ టెక్నీషియన్లు పనిచేశారని సమాచారం. యాడ్ ఎడిటింగ్ జరుగుతోందని.. త్వరలో టీవీ తెరపై కనిపించనుందని తెలుస్తోంది.
యాడ్ విషయం తెలిసి ప్రిన్స్ మహేశ్ అభిమానుల ఆనందానికి అవధి లేకుండా పోయింది. సితారకు (Sitara) జువెల్లరీ కాంట్రాక్ట్ వచ్చిందని మహేశ్ బాబు (Mahesh) ట్వీట్ చేశారు. తల్లిదండ్రులు తాను, నమ్రత గర్వపడుతున్నాం అని పేర్కొన్నారు. త్వరలో ఆ యాడ్ తెరముందుకు రానుందని మహేశ్ తెలిపారు.