బేబమ్మగా టాలీవుడ్ హాట్ కేక్‌లా మారిపోయిన కృతి శెట్టికి.. ప్రస్తుతం సీన్ రివర్స్ అయిపోయింది. ఎంత జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకున్నప్పటికీ.. సరైన కథలు ఎంచుకోలేకపోయింది. దాంతో హ్యాట్రిక్ హిట్లతో పాటు.. హ్యాట్రిక్ ఫ్లాప్‌లను అందుకుంది. అయినా కృతికి ఇప్పుడో బంపరాఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. కృతి కెరీర్‌ను కాపాడేది ఆ హీరోనే అంటున్నారు.
Kriti Shetty: ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో కృతి (Kriti Shetty) కెరీర్ పీక్స్‌కు వెళ్లిపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు కృతి కొంప ముంచేశాయి. ది వారియర్, మాచర్ల నియోజక వర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక రీసెంట్గా వచ్చిన నాగ చైతన్య ‘కస్టడీ’ సినిమా కూడా కృతిని (Kriti Shetty) ఏ మాత్రం కాపాడలేకపోయింది. దీంతో కృతి శెట్టికి ఇక ఆఫర్లు రావడం కష్టమే అనుకున్నారు ఇలాంటి సమయంలోనే కృతికి ఓ బంపర్ ఆపర్ వచ్చినట్టు వార్తలొస్తున్నాయి. ఏకంగా కోలీవుడ్ స్టార్ ఇళయ దళపతి విజయ్‌తో (vijay) ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది.
విజయ్ (vijay) ప్రస్తుతం లోకేష్ కనగరాజ్‌తో కలిసి ‘లియో’ (leo) సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత కస్టడీతో ఫ్లాప్ ఇచ్చిన వెంకట్ ప్రభుతో (venkat prabhu) ఓ సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను అనుకుంటున్నారట. కస్డడీతో కృతికి (Kriti Shetty) హిట్ ఇవ్వలేకపోయిన వెంకట్ ప్రభు.. విజయ్ సినిమా కోసం స్వయంగా రికమెండ్ చేశాడట. దీంతో కృతికి కెరీర్‌కు ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకమనే చెప్పాలి. ఈ సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన కృతి (Kriti Shetty) కెరీర్ క్లోజ్ అయినట్టే. అందుకే అమ్మడి ఆశలన్నీ విజయ్ మీదే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మళయాళంలో ఓ సినిమా చేస్తోంది. ఆ సినిమాలో కృతి బికినీ షో చేసేందుకు రెడీ అవుతున్నట్టు టాక్. అందుకోసం ఏకంగా 4 కోట్లు డిమాండ్ చేసినట్టు గతంలోనే వార్తలొచ్చాయి. బేబమ్మ చేతిలో ఈ సినిమా తప్పితే మరో ప్రాజెక్ట్ లేదు. ఇప్పుడు విజయ్‌తో ఛాన్స్ రావడంతో.. అమ్మడి కెరీర్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.