Anushka Sharma: బాలీవుడ్ నటి అనుష్క శర్మ (Anushka Sharma) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లితో పెళ్లి తర్వాత.. ఆడపా దడపా సినిమాలు చేస్తున్నారు. కూతురు విరుష్క.. బిజినెస్ పనుల్లో బిజీగా ఉన్నారు. భార్య-భర్తల ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకొని.. ఆ క్రేజ్ క్యాష్ చేసుకునే ప్రణాళికతో ముందుకెళ్తోంది.
ఇక నుంచి ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తానని అనుష్క శర్మ (Anushka Sharma) సంచలన ప్రకటన చేశారు అనుష్క శర్మ. కెరీర్ పరంగా ఇతర పనుల వల్ల అంతకుమించి చేయలేనని ప్రకటించింది. తన నుంచి ఇంతకన్నా ఎక్కువ సినిమాలు ఆశించొద్దు అని తెలిపింది. తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. దీంతో అభిమానులు నోరెళ్లబెట్టారు. అనుష్క (Anushka)ప్రకటన వెనక ఎవరు ఉన్నారు. విరాట్ కోహ్లి సినిమాలు చేయొద్దు అన్నాడా.. ఇతర కారణాలు ఉన్నాయా..? పర్సనల్ విషయాలు ఉన్నాయా అనే కోణంలో ప్రశ్నలు వస్తున్నాయి. ఈ కామెంట్లకు కూడా అనుష్క (Anushka) క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేం లేదని తేల్చిచెప్పారు. కుటుంబ కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.
కూతురు వామికకు ఇదీ కీలకమైన సమయం.. తన ఆలనా పాలనా దగ్గరుండి చూడాలి. అశ్రద్ద చేయడానికి ఛాన్స్ లేదు. పిల్లల జీవితంలో పేరంట్స్ జాగ్రత్తగా ఉండాలి. విరాట్ తండ్రి బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్నాడు. వామికకు తల్లిగా తన బాధ్యత ఎక్కువగా ఉంది.. పాపతో తనే ఎక్కువ సమయం గడపాలి.. మిగతా కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నా అని అనుష్క (Anushka) వివరించారు.